అచ్చెన్న పేరుతో నకిలీ లేఖను విడుదల చేసిన వైసీపీ - ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకేనన్న వర్ల రామయ్య - Varla Ramaiah Condemned Fake Letter

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 12:41 PM IST

Varla Ramaiah Condemned Fake Letter Released by YCP Leaders: ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) సంతకంతో వైసీపీ సామాజిక విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargav Reddy) ఫేక్‌ లెటర్లను సృష్టిస్తున్నారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (TDP politburo member Varla Ramaiah) ధ్వజమెత్తారు. 

పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి (Pithapuram TDP Incharge) ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను (SVSN Varma) టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు తప్పుడు లేఖను సృష్టించిన వైసీపీ వాళ్లు దాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓ వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి రెండు వర్గాల మధ్య విబేధాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మధ్య అశాంతిని కలిగించే ఇలాంటి కుట్రపూరిత చర్యలపై విచారణ చేయాలని సీఐడీని కోరారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ- జనసేన జెండా ఎగురుతుందని అప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.