మోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శం: దగ్గుబాటి పురందేశ్వరి - పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిక
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 7:00 PM IST
Various Members Joined In BJP Presence Of Purandeshwari: బీజేపీ పార్టీ భావజాలం, విధానాలు, సిద్ధాంతాలకు పార్టీ నేతలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. భారతీయ జనతా పార్టీలో కొత్త చేరికలు (Joinings) కొనసాగుతున్నాయి. చిత్తూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల వ్యక్తులు పురందేశ్వరి సమక్షంలో ఈరోజు బీజేపీలో చేరారు.
Purandeshwari Invited Into Party: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో (BJP state office) సినీ నిర్మాత చింతపల్లి రామారావు, సిద్దార్ధ గ్రూపు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేతతో పాటు న్యాయవాదులు, రైతు నాయకులు బీజేపీలో చేరారు. వీరందరిని పురందేశ్వరి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన (Narendra Modi ruling) ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.