దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది: వడ్డే శోభనాద్రీశ్వర రావు - వడ్డే శోభనాద్రీశ్వర రావు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 8:29 PM IST
Vadde Sobhanadreeswara Rao Fires on BJP : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో భారీగా ట్రాక్టర్లు, బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు కేంద్ర ప్రభుత్వ రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పలువురు రైతు సంఘాల నేతలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు మాట్లాడుతూ దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, కేవలం దేశంలోనే కొందరు బడా వ్యాపారులకు లబ్ధి చేకూరేలా మోదీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. కార్మిక రైతు సంక్షేమం కేవలం కమ్యూనిస్టు పరిపాలన తోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కమ్యూనిస్టు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.