కూటమి నేతల ఫ్లెక్సీలు చించిన ఆకతాయిలు- పోలీసులకు ఫిర్యాదు - Unknown Persons Torn TDP Flexis - UNKNOWN PERSONS TORN TDP FLEXIS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 2:06 PM IST
Unknown Persons Torn TDP Flexis in NTR District : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇటీవల వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించిన సేవలు, ప్రకటించిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో కూటమి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో ఫ్లెక్సీలు కట్టారు. వీటీని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఆకతాయిల చర్యపై కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటువంటి పనులు చేస్తున్నవారిపై తక్షణం చర్యలు చేపట్టాలని పలువురు ధ్వజమెత్తారు. వరద బాధితులకు వారు చేసిన సహాయానికి కృతజ్ఞతగా పెట్టిన ఫ్లెక్సీలను ఇలా చెయ్యడం ఏంటని స్థానికు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు చంద్రబాబు సహా నేతలంతా అండగా ఉండి సహాయం చేసిన సంగతి తెలిసిందే.