దంపతులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి- దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Unknown Attacked The Couple - UNKNOWN ATTACKED THE COUPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 1:05 PM IST

Unknown Assailant Attacked The Couple In Nellore District : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దంపతులపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఆత్మకూరు బీఎస్​ఎన్​​ఎల్​ (BSNL) కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వాసిలి నుంచి బట్టేపాడుకు బైక్‌పై వెళ్తుండగా దాడి జరిగిందని బాధితులు తెలిపారు. బాధితుడిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్​, సుశీల దంపతులు బట్టేపాడు గ్రామంలో నివాసముంటున్నారు. వారిద్దరు వాసిలి నుంచి వస్తూ ఆత్మకూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర ఓ దుకాణంలో కూల్ డ్రింక్ తాగారు. అనంతరం బట్టేపాడుకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు.

అడ్డుకున్న భార్య సుశీలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్​ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అసలు దాడి పాల్పడినవారెవరు? కారణాలు ఎంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.