పల్నాడు జిల్లాలో దారుణం - మద్యం అప్పుగా ఇవ్వలేదని మహిళ హత్య - Two Men Was Killed Woman - TWO MEN WAS KILLED WOMAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 6:05 PM IST
|Updated : Jun 28, 2024, 6:10 PM IST
Two Men Was Killed By Woman in Palnadu District : మద్యం అప్పుగా అడిగితే ఇవ్వలేదని మహిళను దారుణంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల మేరకు కారంపూడి మండలంలో గురువారం ఓ మహిళ బడ్డీ కొట్టుతో పాటు మద్యం అమ్మే క్రమంలో ఓ వ్యక్తి బాకీ పడ్డాడు. అతని స్నేహితుడితో కలిసి దుకాణంలో మద్యం తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పాత బకాయి చెల్లిస్తేనే అప్పు ఇస్తానని ఆమె తేల్చి చెప్పింది. దీంతో వారు ఆమెపై కక్ష పెంచుకున్నారు.
గురువారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి తలపై కర్రతో కొట్టారు. స్పృహ కోల్పోయిన అనంతరం దారుణంగా హత్య చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కారంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ఆమె గృహంలోనే నిందితులు అద్దెకు ఉంటున్నారని ఎస్పీ తెలిపారు. ఆ ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.