జగన్ పాలన తాలిబన్లను మించిపోయింది: కాంగ్రెస్ నేత తులసి రెడ్డి - Tulasi Reddy press meet
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-03-2024/640-480-21007110-thumbnail-16x9-tulasi-reddy-fire-on-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 4:03 PM IST
Tulasi Reddy Fire on CM Jagan : రాష్ట్రంలో జగన్ పాలన తాలిబన్ల పాలనను మించిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో అప్పులు ఫుల్, సంక్షేమం నిల్‌గా ఉందని తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా తయరు చేశారని, రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. స్వయంగా జగన్ సొంత చెల్లి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి లేఖ రాసారు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. మోదీకి జగన్ భజన రెడ్డిగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసి ప్రస్తుతం పూర్వవైభవం వచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్‌కు రెండు తెలుగు రాష్ట్రాలు కంచుకోటగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి త్వరలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీకి షర్మిలా పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వై నాట్ కాంగ్రెస్ అనేదే మా నినాదమని తెలిపారు. దేశాన్ని మోదీ, అమిత్ షా లు అమ్మేస్తుంటే, అంబానీ, ఆదానీలు కొనేస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ అన్యాయం చేశారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రానికి వస్తున్న మోదీ ఏపీకి ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు.