తిరుమలలో శ్రీవారి పుష్పపల్లకి వాహన ఊరేగింపు - టన్ను పుష్పాలతో అలంకరణ - TTD Organize Srivari Pushpa Pallaki - TTD ORGANIZE SRIVARI PUSHPA PALLAKI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 9:24 PM IST
TTD Was Grandly Organized Srivari Pushpa Pallaki Procession: తిరుమలలో శ్రీవారి పుష్పపల్లకి వాహన ఊరేగింపును తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. శ్రీదేవి, భూదేవి సమేతగా మలయప్పస్వామి వారిని శోభాయమానంగా అలంకరించి పుష్ప పల్లకిపై ఊరేగించారు. నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. పల్లకి ముందు భాగంలో ద్వాపర యుగానికి సంబంధించిన దేవత చిత్రాలను ప్రదర్శించారు. పల్లకిని అందంగా అలంకరించేందుకు వివిధ రకాలకు చెందిన సుమారు టన్ను పుష్పాలను వినియోగించారు.
శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభి ముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు.