పార్శిల్ డెలివరీ ద్వారా రూ.125 ఆదాయార్జనే ఆర్టీసీ లక్ష్యం: ఎండీ సజ్జనార్ - RTC Md Sajjanar On rtc revenue
🎬 Watch Now: Feature Video


Published : Mar 14, 2024, 7:14 PM IST
RTC Md Sajjanar Launched Model Logistic Counter : 2023-24సంవత్సరంలో లాజిస్టిక్స్ పార్శల్ డెలివరీ ద్వారా రూ.120కోట్ల రూపాయల ఆదాయాన్ని టీఎస్ఆర్టీసీ లక్ష్యంగా చేసుకుందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. గత ఏడాది రూ. 70 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో మోడల్ లాజిస్టిక్స్ కౌంటర్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. లాజిస్టిక్స్ వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్శిళ్లను గంటల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సరికొత్త ఆవిష్కరణతో ప్రజల ముందుకు వస్తామని వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీ ద్వారా రోజుకు 15 వేల పార్శిళ్లను అందిస్తున్నామని త్వరలో ఆ సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇటీవలే టీఎస్ఆర్టీసీ 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులు కలిసి ప్రారంభించారు.