మంత్రినైనా ఎప్పుడూ గిరిజన ఆడపడుచునే : మంత్రి గుమ్మడి సంధ్యారాణి - Minister Gummadi Sandhya Rani - MINISTER GUMMADI SANDHYA RANI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 5:41 PM IST
Tribal & Women & Child Welfare Minister Gummadi Sandhya Rani : గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు తీరేలా రహదారి సౌకర్యం కల్పిస్తానని మహిళ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు సాగునీరు అందిస్తే వారి కష్టాలు 90శాతం తీరినట్లేనని అన్నారు. వసతి గృహాల్లో ఉద్యోగుల కొరతను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం సక్రమంగా అందేలా కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఐటీడీఏ (ITDA) జీసీసీ (GCC) లను బలోపేతం చేసి గిరిజనులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి అజెండా అని, స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇస్తానన్నారు. మహిళా రక్షణే కర్తవ్యంగా పని చేస్తానని తాను మంత్రి అయినా ఎప్పుడూ గిరిజన ఆడపడుచునేనని అన్నారు. తన విజయం సాలూరు నియోజకవర్గ ప్రజలందరి విజయమని, బలం, బలగం నాయకులు కార్యకర్తలు, ప్రజలేనని తెలిపారు. ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటాను సంధ్యారాణి అన్నారు.