ప్రజలకు మంచి జరిగేదైతే మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు?- పేదల ఆస్తులకు భద్రత లేదు: మర్రెడ్డి - AP LAND TITLING ACT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 1:43 PM IST

Telugu Rythu State President Marreddy Srinivasa Reddy On Land Titling : సీఎం జగన్‌ ప్రజల ఆస్తులను దోచుకోవడం కోసమే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే తమ ఆస్తులు కోల్పోయినట్లేనని ఆయన ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజలకు మంచి జరిగేదైతే మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉరితాడు లాంటిదని మండిపడ్డారు.  

రాష్ట్రంలో శాండ్​, లాండ్​, వైన్​, మైన్​ దోపిడీ తీరులో ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులు దోచుకన్న జగన్​ ఇప్పుడు ప్రజల విలువైన భూములను లాక్కోవాలనుకుంటున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్​,డిప్యూటీ తహసీల్దార్ ఇలా ఎంతో మంది అధికారులు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి తన ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవడానికి సంవత్సారాల తరబడి సమయం పడుతుంటే, ఇప్పుడు దీన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకుని ప్రజలకు జిరాక్స్​ కాపీలు ఇస్తారా? అంటే దీని ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది కదా అని మర్రెడ్డి ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.