LIVE : తెలంగాణ ఇంటర్ ఫలితాలు - 2024 విడుదల కార్యక్రమం - TS INTER EXAM RESULTS LIVE 2024 - TS INTER EXAM RESULTS LIVE 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 10:59 AM IST
|Updated : Apr 24, 2024, 11:19 AM IST
Telangana Inter Exam Results 2024 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ ఫలితాలను ఒకేసారి విడుదలకు శ్రీకారం చుట్టారు. ఈ ఫలితాలను హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. 1,521 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడం వల్ల సర్వర్ సమస్య తలెత్తె అవకాశం ఉండడంతో ఈసారి అలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరో వైపు సర్వర్ హ్యాంగ్ కాకుండా చూసుకుంటున్నారు. ఈ ఫలితాలను కోసం ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మార్కులు లెక్కించేటప్పుడు ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా విద్యాశాఖ అధికారులు ముందు నుంచే సన్నద్ధం అయ్యారు.
Last Updated : Apr 24, 2024, 11:19 AM IST