Live : జేఎన్టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం - Telangana CM Revanth Reddy Live - TELANGANA CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jul 13, 2024, 4:05 PM IST
|Updated : Jul 13, 2024, 4:52 PM IST
Telangana CM Revanth Reddy Live : ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెంచే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి జేఎన్‌టీయూహెచ్‌లో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గత అయిదేళ్ల నుంచి ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్ల భర్తీ, సీఎస్‌ఈ సీట్లలో పెరుగుదల, కోర్ బ్రాంచీల పరిస్థితి, గ్రామీణ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుముల పెండింగ్ తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించనున్నాయని సమాచారం.ఇక ఇప్పటికే ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 99,170 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్‌బుక్ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగంలో 1,80,424 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 99,170 మంది స్లాట్‌బుక్ చేసుకోగా దాదాపు 80 వేల మంది కన్వీనర్ కోటా సీట్లపై ఆసక్తి చూపలేదు. ధ్రువపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి 88,800 మంది హాజరయ్యారు. ఆ ప్రక్రియ జులై 13తో ముగియనుంది. హైదరాబాద్‌లో మాత్రం జులై 14వ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. జులై 12 నాటికి 60,713 మందే ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
Last Updated : Jul 13, 2024, 4:52 PM IST