ఐదేళ్ల ప్రతిజ్ఞ నెరవేరింది- వీరాభిమానికి చెప్పులు కొనిచ్చిన టీడీపీ నేతలు - TDP worker walked barefoot - TDP WORKER WALKED BAREFOOT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-06-2024/640-480-21658881-thumbnail-16x9-tdp-worker-walked-barefoot-for-five-years.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 5:13 PM IST
TDP Worker Walked Barefoot for Five Years for Party Come to Power : కొందరు తెలుగుదేశం కార్యకర్తలకు ఆ పార్టీపై వల్లమాలిన ప్రేమ ఉంటుంది. కొందరు పార్టీ కోసం కుటుంబాలను, ప్రాణాలను సైతం వదిలిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్త పార్టీ అధికారంలోకి రావటం కోసం ఐదేళ్లుగా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరిగారు. ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో ఇది హట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరిలో మారేశ్ అనే వ్యక్తి తిరువూరు రైతు బజారులో ఓ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు తెలుగుదేశం పార్టీకి వీర అభిమాని.
2019లో టీడీపీ ఓడిపోవడంతో మనస్థాపానికి గురైన మారేశ్ కఠిన దీక్షపూనాడు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యేంత వరకూ చెప్పులు వేసుకోననని తీర్మాణం చేసుకున్నారు. ఇలా ఐదేళ్లపాటు కాళ్లకు చెప్పులు లేకుండానే గడిపాడు. తాజా ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో స్థానిక పార్టీ నాయకులు మారేశ్ వద్దకు వెళ్లి చెప్పులు బహుకరించారు. అలాగే మారేశ్ దంపతులను సన్మానించి అభినందించారు. అనంతరం తిరువూరు రైతు బజారులో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.