'ఏపీలో జగన్ వల్ల చిరు వ్యాపారి నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు లూటీ' - టీడీపీ వాణిజ్య విభాగం రాకేష్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2024/640-480-20717070-thumbnail-16x9-tdp-vanijya-vibhagam-president-doondi-rakesh-fires-on--ysrcp-govt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 5:31 PM IST
TDP Vanijya Vibhagam President Doondi Rakesh Fires on YSRCP Govt : వ్యాపారులను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ఆరోపించారు. ఎవరి హయాంలో వ్యాపారులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమా? అని ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగన్రెడ్డి నిర్ణయాల వల్ల తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి పెద్దపెద్ద పరిశ్రమల యజమానుల వరకు రూ. 10 లక్షల కోట్లు నష్టపోయారని అన్నారు. జగన్ రెడ్డి పాలన దెబ్బకు అన్ని వ్యాపారాలు మూతపడ్డాయని డూండి రాకేష్ మండిపడ్డారు.
చందాల శ్రీను సీఎం సతీమణి భారతి రెడ్డికి 65 లక్షల విలువైన బంగారపు వస్తువు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. వ్యాపారులను వేధిస్తున్న జగన్ రెడ్డికి (Jagan) బుద్ది చెప్పేందుకు వారంతా సిద్దమని డూండి రాకేష్ తెలిపారు. కనీసం బడ్జెట్లో వ్యాపారులకు అనుకూలంగా ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.