ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను- ఇంతటి అరాచక పాలనను చూడలేదు: టీడీపీ నేత గోరంట్ల - TDP Gorantla Butchaiah Exclusive - TDP GORANTLA BUTCHAIAH EXCLUSIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 7:54 PM IST
TDP Senior leader Gorantla Butchaiah Chowdary Exclusive Interview : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంని ఇలాంటి పాలనను చూడలేదన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం దోపిడి, లక్షల కోట్ల రూపాయల అవినీతి, ధరా భారం, ఉపాధి లేమి, రైతులకు గిట్టుబాటు ధరలు లేక పోవడం ఇలా ప్రతి వర్గం జగన్ ప్రభుత్వంలో బాధితులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కసారి లోక్ సభకు, పదో సారి శాసన సభకు నామినేషన్ వేసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన బుచ్చయ్య ఏడోసారి గెలుపు కోసం 78 ఏళ్ల వయస్సులో యువకుడిలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమంటున్న బుచ్చయ్య చౌదరితో ఈటీవీ భారత్ ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.