స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయిస్తే కూటమికి నష్టం- హైకోర్టులో టీడీపీ వాదనలు, సోమవారానికి వాయిదా - TDP Petition In AP High Court - TDP PETITION IN AP HIGH COURT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 10:28 PM IST

TDP Petition in High Court due to Janasena Glass Symbol Issue : జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇతరులకు, స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో వేరే వారికి కేటాయించిన సింబల్ మార్చలేమన్నారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌ని అన్ని రాష్ట్రాలకు పంపించామని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

అయితే జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైఎస్సార్సీపీయే ఈ కుట్రకు తెర లేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.