డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ ఈసీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ - TDP MLC Bhumireddy Letter to EC
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/640-480-21020138-thumbnail-16x9-tdp-mlc-bhumireddy-letter-to-ec.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 12:29 PM IST
TDP MLC Bhumireddy Letter to EC: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఎంపిక కోసం జరిగే డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల(AP Elections 2024) ప్రక్రియ ప్రారంభమవడంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావడానికి అసౌకర్యం కలుగుతుందన్నారు. వేలాది మంది సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ పరీక్ష రాస్తున్నారని తెలిపారు.
MLC Bhumireddy Letter on DSC Exam Postpone: ఎస్జీటీలుగా పనిచేసే అనేకమంది స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. వారిలో చాలా మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్, అలాగే ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉందన్నారు. పరీక్ష ప్రిపరేషన్‌కు అవకాశం ఉండదని అన్నారు. ఇటీవలే ఏపీపీఎస్సీ(APPSC) కూడా వివిధ ఉద్యోగ పరీక్షలను వాయిదా వేసిందని గుర్తు చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.