తాగునీటి కుళాయిల ఏర్పాటు వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారింది: పయ్యావుల - TDP Payyavula on YSRCP Leaders - TDP PAYYAVULA ON YSRCP LEADERS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-04-2024/640-480-21117722-thumbnail-16x9-tdp-mla-payyavula-keshav-fire-on-ysrcp-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 12:39 PM IST
|Updated : Apr 1, 2024, 10:11 PM IST
TDP MLA Payyavula Keshav Fire on YSRCP Leaders: అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి కుళాయిల ఏర్పాటు అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారిందని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టుపక్కల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సాధారణంగా కుళాయి కనెక్షన్ కోసం సంబంధిత శాఖకు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేదన్నారు. అలా డిపాజిట్ మొత్తంతో టీడీపీ ప్రభుత్వ హయాం 2019 నాటికి 5 కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్(Rural Water Supply and Sanitation Department) శాఖలో పొదుపు చేశామన్నారు.
"తాగునీటి కుళాయిల ఏర్పాటు వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. కుళాయి కనెక్షన్ కోసం సంబంధిత శాఖకు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేది. టీడీపీ హయాంలో డిపాజిట్ రూపంలో చెల్లిస్తే కుళాయిలు ఏర్పాటు చేశాం. వైసీపీ వచ్చాక గుత్తేదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు." - పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే