కలియుగ దైవాన్ని అవినీతికి పావుగా వాడుకోవడం దుర్మార్గం: అనగాని సత్యప్రసాద్ - MLA Anagani Satyaprasad key comment - MLA ANAGANI SATYAPRASAD KEY COMMENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-03-2024/640-480-21062068-thumbnail-16x9-tdp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 3:53 PM IST
TDP MLA Anagani Satyaprasad key comments: తిరుమల కొండను జగన్ రెడ్డి అవినీతికి అడ్డాగా మార్చేసాడని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. కలియుగ దైవం శ్రీవారినీ అవినీతికి పావుగా వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ధర్మారెడ్డి టీటీడీలో లేకపోతే జగన్ రెడ్డికి కాళ్లూచేతులూ ఆడవా అని ప్రశ్నించారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడగించాలని ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయడం వెనుక ఆంతర్యమేంటి అని నిలదీశారు. కొండపై అభివృద్ధి పనుల పేరుతో కోట్ల రూపాయిల కమీషన్లు దండుకుంది వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కోడ్ కు ముందు ఆఘమేఘాల మీద కొండపై టెండర్లు పిలవడం కమీషన్లు దండుకోవడమేనని అనగాని దుయ్యబట్టారు. కోడ్ కు ముందే వైసీపీ అవినీతి బాగోతాలు చక్కబెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పవిత్రమైన టీటీడీ ఈవో పదవికి ధర్మారెడ్డి అనర్హుడని విమర్శించారు.
తీతీదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలంటూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో వివాదం రాజుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మెుదలు, తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ, గత కొంత కాలంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈవో ధర్మారెడ్డి అనుకులంగా వ్యవహరిస్తున్నారనే ఆరోఫణలు వినిపిస్తున్నాయి.