యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాాణా - అడ్డుకున్న టీడీపీ నేతలు - ఇసుక అక్రమ రవాణా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 9:04 AM IST
TDP Leaders Stopped Sand Lorries in NTR District : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర, నందిగామ మండలం కంచల గ్రామాల సరిహద్దులో మునేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్జీటీ ఆదేశాలు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులు లేకున్నా మునేరులో జేసీబీలతో ఇసుక తవ్వి నిత్యం వంద టిప్పర్లతో తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక అవసరాలకు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నేత వీరాస్వామి మండిపడ్డారు. జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికార నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అధికారులు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.