టీడీపీ-జనసేన తొలి జాబితాపై అభ్యర్థుల హర్షం - నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం - టీడీపీ అభ్యర్థుల జాబితా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 3:39 PM IST
TDP Leaders Response: టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాలోనే తమకు చోటు దక్కడంపై తెలుగుదేశం సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పొత్తుతో తమకు అదనపు బలాన్ని చేకూరుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రకటనలో గత 9 ఎన్నికల్లో జరగనంత కరసరత్తు ఈ ఎన్నికలకు జరిగిందని తెలుగుదేశం నేతలు అన్నారు. సర్వేలన్నీ చేసిన తరువాతనే అభ్యర్థులను ఖరారు చేశారని తెలిపారు.
ప్రజా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించారని వివరించారు. కోటి మందికి పైగా అభిప్రాయాలను సేకరించారని అన్నారు. చంద్రబాబు అనుభవాన్ని అంతా రంగరించి ఈ లిస్టును తయారు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ- జనసేన కూటమిని అధికారంలోకి తీసుకుని వస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల స్పందన ఇప్పుడు చూద్దాం.