దళితులకు అన్యాయం చేసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారు : టీడీపీ నేతలు - తెలుగుదేశం జనసేన నిరసన
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 1:21 PM IST
TDP Leaders Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహం పేరుతో మరోసారి ఎస్సీలను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పామర్రులో తెలుగుదేశం - జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరు పార్టీల నాయకులు, జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి, నియంత జగన్ ఆవిష్కరించడంపై అంబేడ్కర్ ఆత్మఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాంధవుడిగా చెప్పుకునే జగన్ చేసినవన్నీ మోసాలేనని, తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి దుయ్యబట్టారు. దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరిలో విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా విజయనగరంలో పూసపాటి అదితిగజపతిరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులను పక్కదారి పట్టించడానికే అంబేద్కర్ విగ్రహన్ని ముఖ్యమంత్రి విజయవాడలో ఏర్పాటు చేశారని అన్నారు. ఈ విషయం దళితులకు తెలిసిపోయిందన్నారు.