కుప్పంలో జోరుగా టీడీపీ ప్రచారం - బాబును లక్షఓట్ల మెజార్టీతో గెలిపిస్తామంటున్న శ్రేణులు - TDP Leaders Election Campaign

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 1:51 PM IST

TDP Leaders Election Campaign in Kuppam Constituency: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుప్పం శాసనసభ స్థానానికి బరిలో నిల్వనున్న నేపథ్యంలో ఆయనకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలన్న లక్ష్యంతో నాలుగు మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రచారాలు సాగిస్తున్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (TDP MLC Kancharla Srikanth) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలను కలుసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కుప్పంలో జరిగిన అభివృద్ధి వైసీపీ ఐదేళ్ల పాలనలో కక్ష సాధింపు చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో (TDP Manifesto), సంక్షేమ పథకాలను ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారాలను హోరోత్తిస్తున్నారు. టీడీపీ ప్రచారాలకు ప్రజల్లో చక్కటి స్పందన లభించడం పట్ల నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సారీ కచ్చితంగా టీడీపీ- జనసేన ప్రభుత్వం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.