'మరీ ఇంత కఠినంగా ఉంటే మీరే నష్టపోతారు'- అధికారులకు చెవిరెడ్డి బెదిరింపులపై టీడీపీ ఫిర్యాదు - tdp complaint to EC On Chevireddy - TDP COMPLAINT TO EC ON CHEVIREDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 9:58 AM IST
TDP Leaders Complaint to EC On Chevireddy: నామినేషన్లు వేసే సమయంలోనూ అధికార పార్టీకి చెందిన నేతలు రిటర్నింగ్ అధికారులను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెంలోని మహిళా రిటర్నింగ్ అధికారిని బెదిరించటంపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి బెదిరింపులకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టమని, మీరే నష్టపోతారంటూ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారిని హెచ్చరించిన విషయం తెలిసిందే. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని, మేం రాజకీయ నాయకులం అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తమ మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారని, తాము ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త, కాబట్టి కాస్త చూసీచూడనట్లు వెళ్లండంటూ మహిళా రిటర్నింగ్ అధికారికి చెవిరెడ్డి హెచ్చరించిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. దీనిపై ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.