పోలింగ్ ఏజెంట్లుగా పని చేయకూడదనే కుట్ర- టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: ఈసీకి టీడీపీ ఫిర్యాదు - TDP Leaders Complaint on Police
🎬 Watch Now: Feature Video
TDP Leaders Complaint on Police : మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు పని చేయనివ్వకుండా ఉండేందుకు కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగా వారిపై కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ అయిన వైఎస్సార్సీపీ అనుకూలంగా కొందరు పోలీసు అధికారులు పని చేస్తున్నారని, కావాలనే టీడీపీ నేతలపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించకుండా ఎన్నికల స్పూర్తిని దెబ్బతీసేదిలా పోలీసులు తీరు ఉందని టీడీపీ నేత మన్నవ సుబ్బారావు ఆక్షేపించారు. తక్షణమే ఆలాంటి పోలీసు అధికారులను నిరోధించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు దీర్ఘకాలిక రోగులు, 6 నెలల్లోగా ఉద్యోగ విరమణ చేసే వ్యక్తులను, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినతి పత్రం ఇచ్చారు.