జగన్ ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన : యనమల - Yanamala Ramakrishna Fire on Jagan - YANAMALA RAMAKRISHNA FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 7:03 PM IST
TDP Leader Yanamala Ramakrishna Fire on Jagan Govt: జగన్ రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్సీపీ నేతలకు అవగాహన లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమంటూ వైఎస్సార్సీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని యనమల పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై 7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారని దుయ్యబట్టారు. జగన్ ముఠా లక్షల కోట్లు దోచుకుని తమ ఆదాయం పెంచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భూములే కాకుండా రాష్ట్ర సచివాలయాలు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి చరిత్ర వైఎస్సార్సీపీ నేతలదని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.