అమ్మఒడి పేరుతో తల్లులకు మోసం- విద్యాకానుకతో 'జే గ్యాంగ్' దోపిడీ: టీడీపీ నేత విజయ్‌కుమార్ - Vijay Kumar Comments on Jagan - VIJAY KUMAR COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-04-2024/640-480-21227565-thumbnail-16x9-tdp-leader-vijay-kumar-fires-on-ysrcp-government.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 1:43 PM IST
TDP Leader Vijay Kumar Fires on YSRCP Government: అమ్మఒడి పేరుతో సీఎం జగన్ తల్లులను మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ దుయ్యబట్టారు. 30 వేల మంది విద్యార్థుల జీవితాలతో జగన్ ఆటలాడుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అంటూ డాంభికాలు పలికి ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించలేదని విమర్శించారు. పాఠశాలల యాజమాన్యాలు బలవంతంగా తల్లిదండ్రులతో ఫీజులు కట్టించుకున్నాయని విజయ్ కుమార్ ఆరోపించారు.
జగన్, బొత్స చర్యలతో పేద విద్యార్థుల జీవితాలు బలైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల పర్యటనలో అమ్మఒడి పథకానికి విద్యాభ్యాసం చేస్తున్న అందరూ అర్హులని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారని లేవనెత్తారు. విద్యా కానుక పేరుతో జే గ్యాంగ్ వందల కోట్లు దోచేసిందని ఆయన విమర్శించారు. జగన్ చర్యలతో ఐదు సంవత్సరాలలో 4,750 పాఠశాలలు మూతపడటంతో పేద విద్యార్థులకు చదువు దూరమైందని విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు.