ఏ తప్పు చేయలేదని చెప్పగలరా ? - వారు జైలుకు వెళ్లడం ఖాయం: వర్ల రామయ్య - TDP Leader on VR IAS Officers - TDP LEADER ON VR IAS OFFICERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 7:28 AM IST
TDP Leader Varla Ramaiah Comments on VR IAS Officers: వీఆర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్‌ను కలిశారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై డీజీపీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వీఆర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు చెప్పగలరా అని ప్రశ్నించారు. సీనియారిటీలో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తే నోరెత్తని కొంత మంది అధికారులు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్‌లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ మెప్పు కోసం అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి, వీడియోలు తీసి పైశాచికానందం పొందిన ఐపీఎస్ అధికారిని వీఆర్‌లో పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 170 మంది పోలీసు అధికారులను సంవత్సరాల తరబడి వీఆర్‌లో ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రస్తుతం కళంకిత అధికారుల కోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు. వీఆర్‌లో ఉన్న అధికారులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎందుకు వెళ్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.