కాకాణి కుటిల ప్రయత్నం వల్లే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యా: సోమిరెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 7:31 PM IST
TDP Leader Somireddy Case Against YCP Minister Kakani: వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నకిలీ డాక్యుమెంట్స్ కేసు విచారణలో భాగంగా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు కోర్టుకు హాజరయ్యారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే విదేశాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టానని గత ఎన్నికల్లో కాకాణి తప్పుడు ఆరోపణలు చేశారని దాని ఫలితంగానే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని సోమిరెడ్డి తెలిపారు. తప్పుడు ఆరోపణలపై సివిల్ డిఫర్మేషన్, క్రిమినల్ డిఫర్మేషన్ కేసులు వేశానని ఎనిమిదేళ్ల తర్వాత కేసుల విచారణ ప్రారంభమైందని కాకాణికి శిక్ష తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు.
నేడు డాక్యుమెంట్స్ మార్కింగ్ చేశారని తిరిగి 15వ తేది అమరావతి స్పెషల్ కోర్టులో డాక్యుమెంట్స్ మార్కింగ్ చేస్తామన్నారని సోమిరెడ్డి తెలిపారు. ఈ నెల 21వ తారీకు డిఫర్మేషన్ విచారణకు రానుందని త్వరలోనే క్రిమినల్ కేసు కూడా విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. మలేషియా, కౌలాలంపూర్, సింగపూర్, బ్యాంకాక్‌లలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు కాకాణి ఆరోపించి రూ.1000 కోట్ల ఆస్తులు నాపై ఉన్నట్టు నిరాధార ఆరోపణలు చేశాడని సోమిరెడ్డి అన్నారు. నేను మానసికంగా కృంగిపోవాలని, శారీరకంగా, ఆర్థికంగా రాజకీయంగా నష్ట పోవాలని కుటిల ప్రయత్నం చేశారని సోమిరెడ్డి తెలిపారు.