ఒక్క ఇంటిని తొలగించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశాం - పట్టాభిరామ్ - Retaining Wall in Vijayawada - RETAINING WALL IN VIJAYAWADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 2:19 PM IST
TDP Leader Pattabhiram on Retaining Wall : విజయవాడలో కరకట్ట ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్ పై వాస్తవాలను తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సమాచార హక్కుచట్టం ఇచ్చిన జవాబు ఆధారాలను నేతలు బయటపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు, మొదటి దశ నిర్మాణం పూర్తి, ఖర్చు చేసిన 164.42కోట్ల వివరాలపై తెలుగుదేశం ఓ వీడియో విడుదల చేసింది.
Retaining Wall in Vijayawada : విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి, రిటైనింగ్ వాల్ పూర్తి అంశంపై వైఎస్సార్సీపీతో చర్చకు సిద్ధమని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్‌చేశారు. గద్దె రామ్మోహన్ చొరవ, చంద్రబాబు కృషితో రిటైనింగ్ వాల్ సాధించింది తెలుగుదేశమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి అధికార పార్టీకి తెలీదని దుయ్యబట్టారు. ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణం టీడీపీ పూర్తి చేసిందని గుర్తు చేశారు. వైసీపీ రెండో దశ నిర్మాణంలో వందలాది ఇళ్లు తొలగించి ఎందరినో నిరాశ్రయుల్ని చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు.