టీడీపీ నేత శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు - అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం - Mandra Petition Telangana Hc - MANDRA PETITION TELANGANA HC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 10:51 PM IST
TDP Leader Mandra Petition on Telangana High court: నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి నివాసంలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి నివాసానికి విచ్చేసిన పోలీసులు ఓ కేసు విషయమై తమతో రావాలని కోరారు. అయితే వారెంట్ చూపాలని శివానందరెడ్డి కోరడంతో చేసేదేమి లేక తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో శివానందరెడ్డి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. బోగస్ పత్రాలతో బుద్వేలులో భూమి విక్రయించారన్న కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడిని రేపటి వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
పోలీసులు సోదాలు చేసి శివానందరెడ్డి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారంటూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్ల క్రితం తమపై నమోదైన కేసులో పోలీసులు ఇంట్లో అక్రమంగా చొరబడి సోదాలు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను అదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం వరకు శివానందరెడ్డి కుటుంబసభ్యులను అరెస్టు చేయొద్దని ఒకవేళ ఇప్పటికే అరెస్టు చేసినట్లయితే వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.