చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తాం - మంగళగిరిలో లోకేశ్ హామీ - Lokesh Meet Handloom Weavers
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 5:23 PM IST
TDP Leader Lokesh Meet Handloom Weavers in Mangalagiri: వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. మంగళగిరిలోని పలువురు చేనేత కార్మికుల కుటుంబాలను లోకేశ్ కలిశారు. మంగళగిరిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారితో చర్చించారు. గతంలో చంద్రబాబు చేనేతలకు అందించిన రాయితీలన్నింటినీ జగన్ సర్కారు నిలిపి వేసిందని మండిపడ్డారు. నేతన్నలను ఆదుకునేందుకు వీవర్స్ శాలను ఏర్పాటు చేసి మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన యార్న్, కలర్ సబ్సిడీ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. సొంత మగ్గాలు ఉన్న వారికే నేతన్న నేస్తం అని నిబంధన పెట్టడంతో 90 శాతం మందికి సహాయం అందడం లేదని లోకేశ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ మంచి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పలువురు చేనేత ప్రముఖుల నివాసాలకు లోకేశ్ వెళ్లి వారిని కలిశారు.