LIVE జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే - బొండా ఉమా మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం. - Bonda Uma Live - BONDA UMA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 12:08 PM IST
|Updated : May 21, 2024, 12:29 PM IST
TDP Leader Bonda Uma Maheswararao live: జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 2019 ఫలితాలకు మించి వైసీపీ విజయం సాధించబోతోందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఓడిపోతున్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేక తామే గెలుస్తామంటూ చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్‌లోడ్ పేరుతో ప్రభుత్వ ఈ-ఫైల్స్‌ను ధ్వంసం చేస్తుండటంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 21, 2024, 12:29 PM IST