పార్టీ మారితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా: అచ్చెన్నాయుడు - TDP leader Atchannaidu - TDP LEADER ATCHANNAIDU
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-03-2024/640-480-21068390-thumbnail-16x9-tdp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 3:18 PM IST
TDP leader Atchannaidu: ఓటమి భయంతో వైసీపీ నేతలు హింసా రాజకీయాలతో పేట్రేగిపోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో (Pedakurapadu) టీడీపీ కార్యకర్తల అరెస్ట్ పై ఆయన స్పందించారు. అక్రమ కేసులు, అరెస్ట్ దుర్మార్గమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీని వీడాడనే కక్షతోనే టీడీపీ కార్యకర్త కంచేటి సాయిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. కోడ్ వచ్చినా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోందని అచ్చెన్న దుయ్యబట్టారు.
పార్టీ మారితే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. హింసా రాజకీయాలు చేయడంలో వైసీపీ నేతలు సీఎం జగన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పోలీసులను అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గి పని చేసే వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అచ్చెన్న హితవు పలికారు.