Live: తణుకు ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - TDP Janasena Public Meeting - TDP JANASENA PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 5:24 PM IST
|Updated : Apr 10, 2024, 7:05 PM IST
TDP Janasena Public Meeting In Tanuku : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన,టీడీపీ,బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇందులో భాగంగా ప్రజాగళం పేరుతో చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారు. అలాగే వారాహి విజయ భేరి సభలతో ఇటు పవన్ కల్యాణ్ ప్రచారాన్ని ముమ్మారం చేశారు. మరో వైపు బీజేపీ సైతం ప్రజల్లో విస్త్రతంగా పర్యటిస్తుంది. తాజాగా ప్రజలను చైతన్య పరిచేందుకు కూటమి నేతలందరూ కలిసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగే తణుకు, నిడదవోలు సభలలో పాల్కొంటున్నారు. ఈరోజు తణుకు, నిడదవోలులో జరిగే సభలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు సభలలో పాల్కొంటారు. సాయంత్రం 4 గంటలకు తణుకులో జరిగే సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. తణుకు పర్యటన ముగిసిన తరువాత రాత్రి 7 గంటలకు నిడదవోలులో మరో సభను ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కూటమి నేతలు పాల్కొంటారు. అదేవిధంగా రేపు అంబాజీపేట, అమలాపురంలో జరిగే సభలలో సైతం కూటని నేతలు ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం తణులో కూటమి ఉమ్మడి సభ ప్రత్యక్షప్రసారం మీ కోసం.
Last Updated : Apr 10, 2024, 7:05 PM IST