ఇసుక అక్రమ రవాణాను ఆపాలని టీడీపీ - జనసేన ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 9:28 AM IST

thumbnail

TDP-JanaSena Party Leaders Dharna Stop Illegal Sand Transport: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ ఇసుక రీచ్​లో అక్రమ ఇసుక రవాణాను ఆపాలంటూ తెలుగుదేశం(Telugudesam), జనసేన(Janasena) పార్టీ నేతలు ధర్నా చేశారు. ప్లకార్టులు పట్టుకొని ముఖ్యమంత్రి జగన్(CM Jagan), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదించారు. రీచ్‌లో అనుమతులు లేకుండా రోజుకు కనీసం 100కు పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఇసుకను తవ్విన చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. రీచ్ బయట సైతం భారీగా ఇసుకను డంప్ యార్డ్​ చేశారని ఇది అధికారులకు కనిపించడం లేదా అని ఇరు పార్టీ నేతలు ప్రశ్నించారు. 

క్వారీలో ఇసుక తవ్వుతున్న జేసీబీ(JCB), లారీని జప్తు చేసి తాడేపల్లి(Tdepalli) తహసీల్దార్‌ కార్యాలయానికి అధికారులు తరలించారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న లారీని ఇసుక మాఫియా మారు తాళంతో ఎత్తుకెళ్లింది. జప్తు చేసిన లారీని పోలీస్‌ స్టేషన్​లో అప్పగించకుండా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇసుక మాఫియాతో మాట్లాడుకునేందుకే లారీని స్టేషన్‌లో అప్పగించకుండా రెవెన్యూ కార్యాలయం దగ్గర పెట్టారని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. అధికారుల అలసత్వం కారణంగానే తహశీల్దార్‌ కార్యాలయంలోకి చొరబడి స్వాధీనం చేసుకున్న లారీనీ ఇసుక మాఫియా గుండాలు ఎత్తుకెళ్లారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.