అధికార పార్టీ ఫ్లెక్సీలకే అవకాశం!- పేర్ని నాని ఆదేశాలతో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు - TDP Flexi is Remove
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 1:17 PM IST
TDP Flexi is Removing Municipal Staff in Machilipatnam : మచిలీపట్నంలో తెలుగుదేశం ఫ్లెక్సీలను తొలగించడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే పేర్ని నాని మౌఖిక ఆదేశాలతో పురపాలక సిబ్బంది (Municipal Workers) తెలుగుదేశం ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నగరంలో పలుచోట్ల టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు తెలియజేస్తూ కొల్లు రవీంద్ర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని సహించకలేని పేర్ని నాని వాటిని వెంటనే తొలగించాలని వెంటనే పురపాలక సిబ్బందికి తెలియజేశారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నగరంలో పలుచోట్ల ఇరుపార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతే మున్సిపల్ అధికారులు వైసీపీ ఫ్లెక్సీలను అలాగే ఉంచారు. కానీ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మాత్రం తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి తొలగిస్తే ఇరుపార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని పేర్కొన్నారు. అధికార పార్టీ ఫ్లెక్సీలు అలాగే ఉంచి, టీడీపీవి ఎందుకు తొలగించారు అని మండిపడ్డారు.