డీజీపీని తప్పించాలి- షర్మిల,సునీతకు రక్షణ కల్పించాలి: ఈసీకి టీడీపీ నేత వర్ల లేఖ - TDP complaint to CEO - TDP COMPLAINT TO CEO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 10:33 PM IST

TDP Complaint to CEO Against DGP: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలంటూ ఎన్నికల సీఈఓకి టీడీపీ మరోమారు ఫిర్యాదు చేసింది. ప్రాధాన్యతా క్రమంలో ఆయన్ను డీజీపీగా నియమించలేదని సీనియర్లను పక్కన పెట్టి ఇంఛార్జిగా అయనకు బాధ్యతలు ఇచ్చారని టీడీపీ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆయన ఇప్పటికీ జగన్​కు కృతజ్ఞతతో ఉంటానంటూ మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీని బదిలీ చేయాల్సిందిగా ఈసీని కోరినట్టు టీడీపీ స్ఫష్టం చేసింది. జగన్ ప్రచారం చేస్తున్న బస్సు డోరు దగ్గరే నిలబడాలంటూ ఎస్పీలకు జారీ చేసిన సర్క్యులర్ విస్మయం కలిగిస్తోందని వెల్లడించారు. గులకరాళ్లు పడకుండా భద్రత కట్టుదిట్టం చేస్తే సరిపోతుందని ఎస్పీలు, కమిషనర్లు బస్సు డోర్ల వద్ద నిలబడటం ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నించారు. 

ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నాడని మాచర్ల నియోజకవర్గంలో ఓ బీసీ యువకుడి ట్రాక్టర్ తగులబెట్టారని, కడపలో టీడీపీకి ఓటు వేస్తామన్న వృద్ధ దంపతుల్ని వైసీపీ నేతలు కొట్టారని ఆరోపించారు. కడపలో పోటీ చేస్తున్న షర్మిలకు, ప్రచారం చేస్తున్న సునీతకు రక్షణ కల్పించాలని కోరినట్టు వర్ల తెలిపారు. ఇతర పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ మానవతా వాదంతో తాను వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు వివరించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సజావుగా ఎన్నికలు నిర్వహించగలరా అన్నదే టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోందని ఆయన్ను మార్చకపోతే కేంద్ర బలగాలకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సిందిగా కోరినట్టు వర్ల తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.