రాజకీయ వ్యభిచారి కేశినేని నాని - వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం: బుద్దా వెంకన్న - TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 1:20 PM IST
TDP Buddha Venkanna Comments: ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను మచ్చిక చేసుకోవడం కేశినేని నానికి అలవాటేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబుపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై వెంకన్న మండిపడ్డారు. విజయవాడ నుంచి కేశినేని నానిపై చంద్రబాబును పోటీ చేయమని చెప్పడం ఏంటిని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేందుకు ఇష్టపడని కేశినేని నాని ఇప్పుడు వైసీపీ నేతల బూట్లు నాకుతున్నాడని దుయ్యబట్టారు. కేశినేని నాని కానీ, ఆయన కుమార్తె కానీ విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేస్తే 30 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని, విజయవాడ నుంచి కేశినేని నాని 3 లక్షల ఓట్లతో ఓడిపోతాడని బుద్దావెంకన్న తెలిపారు.
చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉదయం లేచింది మొదలు దేవినేని అవినాష్ అనుచరుడిలా కేశినేని నాని ఉంటున్నారని విమర్శించారు. ఒంటరి వాడైన కేశినేని నాని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలుగుదేశంతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి కేశినేని నాని అంటూ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.