మరో వివాదంలో కొడాలి- మహిళలతో పాదపూజలు - Kodali Nani milk abhishekam video - KODALI NANI MILK ABHISHEKAM VIDEO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:08 PM IST

Updated : Apr 3, 2024, 12:21 PM IST

TDP Angry Towards Kodali Nani Overaction: ఎన్నికల్లో నేతలు ఓటర్ల కాళ్లు మొక్కడం చూస్తాం కానీ కృష్ణా జిల్లా గుడివాడలో బూతులు నేతగా పేరొందిన మాజీమంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) మాత్రం రివర్స్​లో మహిళలతో పాలతో కాళ్లు కడిగించుకున్నాడు. దీంతో స్థానికంగా ఈ వార్త చర్చనీయాంశమైంది. కొడాలి నానికి కాళ్లు కడిగిన వారిలో వాలంటీర్ హారిక కూడా ఉన్నారు. ముఖానికి ముసుగేసుకుని మరీ ఆమె కొడాలి కాళ్లు కడిగారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

నిత్యం బూతులతో విరుచుకుపడే కొడాలి నాని మహిళల్ని చులకన చేసి ప్రవర్తిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలతో కాళ్లను కడిగించుకోవడం ఏంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము(TDP candidate Venigandla Ramu) మండిపడ్డారు. కొడాలి నాని అహంకారం, బలుపునకు ఇది మరో నిదర్శనమన్నారు. అహంకారంతో మహిళలను చులకన చేసి ప్రవర్తిస్తున్న కొడాలి నానికి ఎన్నికల్లో తమ ఓట్లతో మహిళలే తగిన బుద్ధి చెప్తారని వెనిగండ్ల రాము అన్నారు. 

Last Updated : Apr 3, 2024, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.