నాడు, నేడు పనుల్లో ప్రభుత్వ జాప్యం- శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 7:08 PM IST

Students Suffering Due to Stop The Nadu Nedu Works: నాడు- నేడు కార్యక్రమం కింద అంతచేశాను, ఇంతచేశాను అని గొప్పలకు పోతున్న జగనన్న కనీసం పిల్లలు చదువుకునేందుకు మంచి భవనం కట్టలేకపోతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిడుమోలు గ్రామంలో పాఠశాల భవనంపై పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. నాడు- నేడు కింద 2022లో 28లక్షల 74వేల రూపాయల అంచనాతో శంకుస్థాపన చేసి కొత్త భవనాలు ప్రారంభించారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో నాడు- నేడు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని కమ్యూనిటి హాల్లోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. 

పాఠశాల భవనం పూర్తి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను అడుగుతున్నా వారి నుంచి సరైన స్పందన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నాడు- నేడు పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం జగనన్న విద్యాదీవెన నాలుగవ విడత ప్రారంభం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి పామర్రులో రానున్నారు. ఈ నేపథ్యంలో నిడుమోలు గ్రామంలో నిలిచిపోయిన నాడు- నేడు పనులపై సీఎం దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.