వరద బాధితులకు 'రెడ్​క్రాస్​' సాయం - స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న విద్యార్థులు - Students Helping Flood Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 5:02 PM IST

thumbnail
వరద బాధితులకు 'రెడ్​క్రాస్​' సాయం - స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న విద్యార్థులు (ETV Bharat)

Students Helping Flood Victims on Behalf of Red Cross : ఆపదలో ఉన్నవారికి చేసేదే అసలైన సాయం అంటున్నారు ఆ యువత. వరద బీభత్సంతో సర్వం కోల్పోయిన వారికి తమ వంతు సాయం అందిస్తామంటూ కదలివచ్చారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అలమటిస్తున్న బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఒక్కటై ముంపు ప్రాంతాల్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయాలని రెడ్​క్రాస్ పిలుపు మేరకు రాష్ట్రంలోని వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాధితులకి అండగా నిలుస్తున్నారు.

"బాధితులకు ఎటువంటి సాయం కావలన్నా దగ్గరుండి చేస్తున్నాం. వారికి కావాల్సిన ఆహారం, నీళ్లు, పళ్లు, పాలు, మందులు అన్నింటిని సమకూర్చుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ సాయంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి విధిలో మెడికల్ క్యాంప్​లను ఏర్పాటు చేశాం. గత పదిరోజులుగా ప్రభుత్వం ఏ విధంగా నిర్విరామంగా పనిచేస్తుందో రెడ్​క్రాస్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది. బాధితులు కొలుకునే వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆపత్కాలంలో ఉన్న ప్రజలను ఆదుకునే అవకాశం రావటం చాల సంతోషంగా ఉంది" అని రెడ్​క్రాస్ వాలంటీర్లు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.