ఆ రిజర్వాయర్‌లో పడి మూడు రోజుల్లో ఇద్దరు మృతి- పోలీసుల చర్యలేవి? - Student Dead Swim in Reservoir - STUDENT DEAD SWIM IN RESERVOIR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 10:57 PM IST
Student Dead After Going Swim in Reservoir : విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లిన యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గంభీరం రిజర్వాయర్‌కు వెళ్లారు. హితేష్ అనే యువకుడు రిజర్వాయర్‌లో దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టడానికి ఇబ్బంది పడి మునిగిపోయాడు. అతని స్నేహితులు వెంటనే రక్షించడానికి ప్రయత్నించిన సాధ్యపడలేదు. కళ్లముందే హితేష్ చనిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.
స్నేహితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే రిజర్వాయుర్‌లో రెండు రోజుల క్రితం జారిపడి ఓ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.