సీఎంపై గులకరాయి కేసు నిందితుడి బెయిల్ విషయంలో కీలక మలుపు - Bail to Accused Satish Stone case - BAIL TO ACCUSED SATISH STONE CASE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 11:34 AM IST
Stone Attack on Jagan Bail to Accused Satish : సీఎంపై గులకరాయి విసిరిన కేసులో నిందితుడి బెయిల్ విషయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుడు సతీష్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం విజయవాడ 8వ ఏడీజే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని అదే కోర్టు బుధవారం అబెయెన్స్‌లో ఉంచింది. నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలని తాము హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం తరఫున ఏపీపీ కల్యాణి 8వ ఏడీజే కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై నిర్ణయం వెలువడే వరకు బెయిల్‌ను అబెయెన్స్‌లో ఉంచాలని అందులో అభ్యర్థించారు.
దీనిపై నిందితుడి తరఫు న్యాయవాది కునుకు రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమోను పరిగణలోకి తీసుకోవద్దని న్యాయాధికారిని కోరారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి లక్ష్మి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా బెయిల్‌ని అహెయెన్స్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం సాయంత్రం వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పూచీకత్తులపై నిందితుడి తరపు న్యాయవాదులు ఒకటో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఎంఎం కోర్టు వెనక్కి ఇచ్చింది.