'ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి'- ఏలూరులో పర్యటించిన ప్రధాన ఎన్నికల అధికారి - Mukesh Kumar Meena Visit - MUKESH KUMAR MEENA VISIT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 4:05 PM IST
State Chief Electoral Officer Mukesh Kumar Meena Visit in Eluru District : ఏలూరు జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్షించారు. కలెక్టరేట్ లోని స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ గదులను తనిఖీ చేశారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీకి ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు తప్పకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.