బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం - Brahmotsavam in Tirupati District

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 6:36 PM IST

Sri Kalahasteeshwaralayam Brahmotsavam in Tirupati District : మూగజీవుల ముక్తి క్షేత్రంగా, భక్తుల పాలిట భూ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి ( మార్చి 3) నుంచి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరీకరించారు. భక్త కన్నప్ప కొండపై నిర్వహించే కైలాసనాథస్వామి ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో దేవతామూర్తులు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ నెల 3న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 16న శాంతి అభిషేక ఘట్టంతో ముగుస్తాయని ఆలయ ఈవో ఎస్​.వి నాగేశ్వరరావు తెలిపారు.  ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.