భార్యను చంపి జైలుకు - బెయిల్పై వచ్చి అత్తనూ హతమార్చిన అల్లుడు - MURDER IN PRAKASAM DISTRICT - MURDER IN PRAKASAM DISTRICT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21838258-thumbnail-16x9-murder-in-parakasam-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 1:37 PM IST
Son-in-law Killed Aunt in Prakasam District : మద్యం మత్తులో విచక్షణ మరచిన అల్లుడు ఏడాది వ్యవధిలో భార్యను, అత్తను హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే మహిళ తన కుమార్తెను శ్రీను అనే వ్యక్తికి ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేసింది. వారికి ఇద్దరు సంతానం. మొదటి నుంచి చెడు వ్యసనాలకు బానిసైన శ్రీను 12 నెలల క్రితం భార్యను తలపై రొకలిబండతో కొట్టి హతమార్చాడు. అప్పట్లో అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీను జైలుకు వెళ్లాడు. జైలుకు వెళ్లేటప్పుడు ఇంట్లో అందరినీ చంపేస్తానని హెచ్చిరించి వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న శ్రీను కొన్ని రోజుల క్రితం బెయిల్ పై బయటకి వచ్చాడు. రాత్రి వేములకోటకు వెళ్లి అత్త నారాయణమ్మను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. దీంతో గ్రామస్థులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.