మరోసారి అంబటిపై అల్లుడు వ్యాఖ్యలు- తన పిల్లలను పంపించాలని విజ్ఞప్తి - Ambati Rambabu Son in law - AMBATI RAMBABU SON IN LAW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 10:44 PM IST

Son-in-law Goutham Counter To Ambati Rambabu: తన తండ్రి చివరి ఘడియల్లో ఉన్నప్పుడు మనవడిని, మనవరాలిని చూడాలని ఉందని వేడుకున్నా జాలి చూపని కసాయి వ్యక్తి మంత్రి అంబటి రాంబాబు అని ఆయన మాజీ అల్లుడు డాక్టర్ గౌతమ్ అన్నారు. తన కుమార్తెను, పిల్లలను పట్టించుకోని దుర్మార్గుడు గౌతమ్ అని చేసిన అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నాలుగు సంవత్సరాలుగా పిల్లలు నాన్న, నాన్న అని ఆరాటపడుతున్నా వారిని తనకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను పోషించుకునే శక్తి, ఆర్ధిక స్థోమత తనకు ఉన్నాయన్న గౌతమ్‌ తన కొడుకు, కుమార్తెను అంబటి రాంబాబు తన వద్దకు పంపించాలని కోరారు.

ఇటీవల మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబ సభ్యుల నుంచే నిరసన సెగ తగిలింది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ మాజీ అల్లుడు వీడియో విడుదల చేశాడు. మంచితనం, మానవత్వం లేని మనిషని, సిగ్గు లేని అంబటి రాంబాబు లాంటి వారికి ఓటేస్తే సమాజం నాశనం అవుతుందని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.