సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు- పేదల ఆస్తులు కాపాడాలి: సోమిరెడ్డి - SOMIREDDy allegations - SOMIREDDY ALLEGATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 5:22 PM IST
Somireddy On Sarvepalli Land Scams: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అల్లుడి బినామీ కంపెనీ కోసం పేద రైతుల నుంచి భూములు లాక్కున్నారని విమర్శించారు. సుధాకర్ అనే రైతుకు మంత్రి కాకాణి అల్లుడు ఫోన్ చేసి బెదిరించారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని పేదల ఆస్తులు కాపాడాలి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
"రాష్ట్ర మంత్రి కాకాణి ఆయన అల్లుడి కంపెనీ కోసం అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. ఇళ్ల పట్టాలను శాశ్వత పట్టాలుగా మార్చి జీవో తెచ్చారు. ఆ పట్టాలను వైఎస్సార్సీపీ నాయకులు తమ ఇళ్లలో పెట్టుకున్నారు. 40 ఏళ్ల నుంచి ఆధీనంలో ఉన్న భూములను కబ్జా చేస్తారా? కాకాణి భూ కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? భూ అక్రమాలపై లోకాయుక్తకు వెళ్లాం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆస్తులు కాపాడాలి. విచారణ జరిపించాలి’’ - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి